
హుస్సేన్‌నగరం నుంచి పోలింగ్ బూత్‌కు వెళ్లే దారి
సాక్షి, పెదకూరపాడు : పురాతన కాలంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థిని చేతులు ఎత్తి ఎన్నుకునేవారు. అనంతరం బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం అధునిక యుగంలో ఈవీఎంలు, వీవీప్యాడ్‌లు వచ్చాయి. అయినా ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు మాత్రం సార్వత్రిక ఎన్నికలైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా ఓటు వేయాలంటే రెండున్నర కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాల్సిందే. మండలంలోని రామాపురం పంచాయతీ పరిధిలోని 20 ఎస్సీల కుటుంబాలకు 50 ఏళ్ల క్రితం గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్‌నగరం స్థలాలు కేటాయించారు. అక్కడే వారు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. అప్పటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. హుస్సేన్‌నగర్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని వారు కోతున్నప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పెదకూరపాడు నియోజకవర్గంలోని 156 బూత్‌లో మొత్తం 710 ఓట్లు ఉంటే వారిలో 84 ఓట్లు వీరివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment