పెదకూరపాడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ! | Shock to Congress in Pedakurapadu of Guntur District | Sakshi
Sakshi News home page

పెదకూరపాడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ!

Published Sun, Apr 27 2014 11:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పెదకూరపాడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ! - Sakshi

పెదకూరపాడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ!

అమరావతి: గుంటూరు జిల్లాలో అంతంతమాత్రంగానే ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నిమ్మ విజయసాగర్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  
 
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా సమర్పించిన విజయసాగర్ బాబు 2000 మంది అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయసాగర్‌బాబును  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు.
 
సీమాంధ్ర అభివృద్ధి, మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విజయసాగర్ బాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయంలో పాలుపంచుకుంటామని కార్యకర్తలు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement