
సాక్షి, గుంటూరు: సాగునీరు విడుదల కోరుతూ రైతులు ఆందోళనకు దిగడంతో నూజెండ్లలోని పమిడిపాడు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రైతులు పమిడిపాడు కాలువకట్టపై బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని
బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బొల్లా బ్రహ్మనాయుడు
కిందపడిపోయి.. స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.