Nuzendla
-
పమిడిపాడు కాలువగట్టుపై రైతుల ఆందోళన
-
పమిడిపాడు కాలువగట్టుపై రైతుల ఆందోళన.. ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: సాగునీరు విడుదల కోరుతూ రైతులు ఆందోళనకు దిగడంతో నూజెండ్లలోని పమిడిపాడు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రైతులు పమిడిపాడు కాలువకట్టపై బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బొల్లా బ్రహ్మనాయుడు కిందపడిపోయి.. స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
న్యూజెండ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. మండల కేంద్రంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసి నలుగురిని గాయపరిచింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్క దాడితో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. -
'నూజెండ్లను కరువు మండలంగా ప్రకటించాలి'
నూజెండ్ల (గుంటూరు జిల్లా) : నూజెండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ వైఎస్సార్సీపీ వినుకొండ నియోజక ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నా కరవు మండలంగా ప్రభుత్వం ప్రకటించకపోవటం దారుణమని బ్రహ్మనాయుడు అన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.