Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM Chandrababu Reason For This YS Jagan Condemn Attack on MP Mithun Reddy
ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫ్యలంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.‘‘ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వినుకొండలో రషీద్‌ను హతమార్చిన 24 గంటల్లోనే‌ ఈ దాడి జరగటం దారుణం. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యధేచ్చగా దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. I strongly condemn the attack on @YSRCParty Lok Sabha MP PV Midhun Reddy garu and former MP Reddeppa garu by those associated with @JaiTDP. This incident comes just 24 hours after the brutal murder of Rashid in Vinukonda by a TDP goon. Since coming to power, the new regime has…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024వైఎస్సార్‌సీపీ అత్యవసర సమావేశంరాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న దాడులు, పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జగన్‌పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్యకు గురవ్వడం, ఇవాళ చిత్తూరు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరగడం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక.. రేపు వినుకొండకు వెళ్లనున్న జగన్‌.. హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకి జగన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Indian Squad Announced For Sri Lanka White Ball Series 2024
శ్రీలంక సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్

త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్‌ యాదవ్‌ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రోహిత్‌ సారథ్యం వహించనుండగా.. రెండు జట్లకు (టీ20, వన్డే) శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్‌కు మొండిచెయ్యి ఎదురైంది. వన్డే జట్టుకు హర్షిత్‌ రాణా కొత్తగా ఎంపికయ్యాడు. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కోహ్లి కూడా వన్డే జట్టులో ఉన్నాడు. రిషబ్‌ పంత్‌, రియాన్‌ పరాగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే, అర్షదీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్‌ అహ్మద్‌ రెండు జట్లకు ఎంపికయ్యారు. హార్దిక్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండిన రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మలకు రెండు జట్లలో చోటు దక్కలేదు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.

FASTag Rule Update Get Ready To Pay Double Toll Fee
ఎన్‌హెచ్‌ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు

టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్‌స్క్రీన్‌ మీద కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌పై అంటించాలి.కొందరు వాహనదారులు విండ్‌స్క్రీన్‌ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.విండ్‌స్క్రీన్‌ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్‌ట్యాగ్‌ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది.

Trump shooter crooks posted July 13 will be my premiere in social media
ట్రంప్‌పై దాడి.. ముందే హింట్‌ ఇచ్చిన క్రూక్స్‌!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ ట్రంప్‌పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుట్లెట్‌ పక్కకు దూసుకువెళ్లింది. వెంటనే ఆప్రమత్తమైన సిక్రెట్‌ సర్వీస్ ఎజెంట్లు ఆయన ఆస్పత్రి తీసుకెళ్లారు. అనంతరం వారి జరిపిన కాల్పుల్లో నిందితుడు క్రూక్స్‌ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా క్రూక్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు సోషల్‌ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో సందేశం ద్వారా కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. ‘జూలై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి’అని క్రూక్స్‌ సోషల్‌మీడియా పోస్ట్‌ చేశాడని తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అతడు షూట్‌ చేడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్‌, లాప్‌టాప్‌పై పరిశీలిస్తున్నారు.క్రూక్స్‌ మొబైల్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రెజిడెంట్‌ బైడెన్‌ ఫోటోలు, డొమెక్రటిక్‌ నేషనల్‌ కన్వేషన్‌ షెడ్యూల్‌, ట్రంప్‌ పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీకి సంబంధించి సమాచారం ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. క్రూక్స్‌ రెండు మొబైల్స్‌ కలిగి ఉన్నాడని ఒకటి కాల్పుల ఘటనాస్థలిలో స్వాధీనం చేసుకోగా.. మరోఫోన్‌ అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు తెలిపారు. అందులో కేవలం 27 కాంటక్ట్‌ నెంబర్లు మాత్రమే ఉ‍న్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.

TDP Attacks High Tensions In Punganur Latest News Updates
పుంగనూరులో టీడీపీ విధ్వంసకాండ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం!

చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించడం, ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.మిథున్‌రెడ్డిని అడ్డుకునేందుకు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఆ కవ్వింపు చర్యలను ప్రతిఘటించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎంపీ గన్‌మెన్‌ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడా వీరంగం సృష్టించారు. రెడ్డప్ప ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆయన కారుకు నిప్పు పెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో 15 కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్‌రెడ్డితో చర్చలు జరిపారు. చివరకు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్‌ నివాసానికి ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. ఇది హత్యాయత్నమే.. ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ.. దీన్నొక హత్యాయత్నంగా అభివర్ణించింది. మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడిభయపడేది లేదు: మిథున్‌రెడ్డిపుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు.

Ex Minister Harish Rao Political Counter To CM Revanth
సీఎం రేవంత్‌కు హరీష్‌ రావు కౌంటర్‌.. రాజీనామా లేఖలో..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్‌ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.మరోవైపు.. సీఎం రేవంత్‌ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్‌ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్‌ రావు.. కాంగ్రెస్‌ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై తాజాగా హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా కౌంటరిచ్చారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్‌ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024

Movie Artists Association Leaders Meet Telangana DGP Over Trolling Issue
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!

సాక్షి, హైదరాబాద్‌: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్‌.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్‌ ఛానల్స్‌ను తొలగించింది.స్పెషల్‌ సెల్‌గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్‌ ఛానల్స్‌ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్‌ సెల్‌ ఇకపై దీనిపైనే ఫోకస్‌ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్‌ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్‌ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్‌ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్‌ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్‌ ఛానల్స్‌ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్‌నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్‌ మూవీ.. ఎక్కడంటే?

BITS Pilani Dropout youtuber earns rs 35 Lakh Last Month Ashneer Grover shocking Reaction
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్‌ రియాక్షన్‌

బిట్స్‌ పిలానీ డ్రాప్‌అవుట్‌, 20యేళ్ల యూట్యూబర్‌ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్‌ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి ‘లీక్డ్‌’ పేరుతో నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో ఇషాన్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్‌ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్‌ అష్నీర్ గ్రోవర్‌, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్‌ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్‌1 పోడ్‌కాస్ట్‌లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్‌ గ్రోవర్‌ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్‌శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్‌)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్‌ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్‌ వ్యాఖ్యానించాడు.

Neet-ug 2024 Hearing Supreme Court Live Updates
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్‌ విచారణ వాయిదా

న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్‌సైట్‌లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్‌ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
title
ఎన్‌హెచ్‌ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు

టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌ ప్రవేశపెట్

title
గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్‌ ఎక్స్ ప్

title
ఉత్తరాఖండ్‌లో కూలిన సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్‌ బ్రిడ

title
Video: రైలు ప్ర‌మాదం.. తృటిలో త‌ప్పించుకున్న ప్ర‌యాణికుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గురువారం ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

title
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!

లక్నో: లోక్‌ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్ర

International View all
title
ట్రంప్‌పై దాడి.. ముందే హింట్‌ ఇచ్చిన క్రూక్స్‌!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన

title
ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్‌ శాంతమ్మ మనవరాలే..!

అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్‌ అ‍వ్వడంతో ఒక్కసారిగా ఆయన భార్య ఉషా చిలుక

title
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం

ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిన

title
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ స్క్రీనింగ్‌ టైమ్‌

స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్‌) సమయం క్రమంగా పెరుగుతోంది.

title
చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

బీజింగ్: చైనాలోని జిగాంగ్‌ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.

NRI View all
title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all