జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం | Axe attack on German train injures four | Sakshi
Sakshi News home page

జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం

Published Tue, Jul 19 2016 6:46 AM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం - Sakshi

జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం

జర్మనీ : జర్మనీలో ఓ యువకుడు మంగళవారం బీభత్సం సృష్టించాడు. రైలులో ప్రయాణికులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడు 17 ఏళ్ల ఆఫ్ఘాన్ శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. ఈ దాడికి ఐసీస్కు సంబంధాలు అనే కోణంలో భద్రత దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.  అయితే ఈ దాడిలో గాయపడిన నలుగురు యువకుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement