
సాక్షి, బెస్తవారిపేట: అధికార పార్టీ టీడీపీ వర్గీయుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పచ్చర్ల వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త తిరుపతిరెడ్డిపై టీడీపీ వర్గీయులు చిన్న పిచ్చయ్య, అతని అనుచరులు గొడ్డలితో దాడికి చేసి దాష్టీకానికి దిగారు. గాయపడ్డ తిరుపతిరెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు.
బాధితుడు తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థలం విషయంలో తనతో గొడవ పడి చిన్న పిచ్చయ్య, మరికొందరు వ్యక్తులు కలిసి తనపై అన్యాయంగా దాడికి పాల్పడ్డారని వాపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంతలా బరితెగించి దాడులు పాల్పడుతండటంపై స్థానికంగా విస్మయం వ్యక్తమవుతోంది. దాడి చేసిన టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment