వీడిన కృపాకర్ కుటుంబం హత్య కేసు మిస్టరీ
కడప: కడపలో ఏడాది క్రితం జరిగిన ఓ కుటుంబం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు ఐదుగురూ హత్యకు గురైనట్టు విచారణలో తేలింది.
కృపాకర్ తన భార్య మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో హత్యకు పథకం వేసినట్టు జిల్లా ఎస్పీ నవీన్ చెప్పారు. కృపాకర్ భార్య మౌనికతో పాటు ముగ్గురు పిల్లలను హత్య చేయించినట్టు తెలిపారు. అనంతరం కృపాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయాలన్నీ తెలిసినా రాజారత్నం నిజాన్ని బయటపెట్టలేదని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. జియోన్ స్కూల్ ఆవరణలోనే మృతదేహాలను పాతిపెట్టినట్టు ఎస్పీ తెలిపారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు.
...........