
హంసఅరస్ (ఫైల్)
మండ్య, (యశవంతపుర): వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య నగరంలోని స్వర్ణసంద్రలో జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి సైన్యంలో సిపాయిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఊళ్లోనే ఉంటున్నాడు. హంస అరస్ (30) అనే మహిళతో 10 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి బిగించుకుని హంస ప్రాణాలు తీసుకుంది. శివకుమార్ వచ్చి చూడగా ఫ్యాన్‌కు భార్య మృతదేహం వేలాడటం చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటం లేదు. మండ్య తూర్పు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.