
చింతలమానెపల్లి (సిర్పూర్): కశ్మీరులో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ రాజేశ్ దాకువా అంత్యక్రియలు గురువారం స్వగ్రామం కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజేశ్ భౌతికకాయం రవీంద్రనగర్‌కు చేరుకుంది. సాయంత్రం సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. మొదట ప్రజల సందర్శనార్థం రాజేశ్ దాకువా పార్థివదేహాన్ని గ్రామంలోని పాఠశాల మైదానంలో ఉంచారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమవుతూ అంజలి ఘటించి నివాళులర్పించారు. తల్లి లతిక, భార్య జయ, కుమార్తెలు రోషిణి, ఖుషి, సోదరి మీనా, రీనా రాజేశ్ భౌతికకాయం చూడగానే కన్నీరు మున్నీరుగా రోదించారు. ఆర్మీ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. జవాన్ చితికి కుమార్తె రోషిణి నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment