
బాలమందిరాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు,నిందితుడు సిద్ధయ్య (ఫైల్)
కర్ణాటక , రాయచూరు రూరల్: నగరంలోని బాల మందిరానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఓ జవాన్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆజాద్ నగర్‌లో ప్రభుత్వ ఆధీనంలో రిమాండ్ హోం నిర్వహిస్తున్నారు. అయితే ఆ రిమాండ్ హోంలో ఎల్‌బీఎస్ నగర్‌కు చెందిన ఓ అనాథ బాలిక ఉంటోంది. అక్కడే జవాన్‌గా పని చేసే సిద్ధయ్య(26) అనే వ్యక్తి ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి గత నవంబర్ 11న బీఆర్‌బీ సర్కిల్ వద్ద గల తన ఇంటికి పిలుచుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఇటీవల తరచు ఆమెను వేధిస్తుండడంతో విసిగి పోయిన ఆ బాలిక ఫిర్యాదు మేరకు మేల్కొన్న జిల్లాధికారి వెంకటేష్ కుమార్ శుక్రవారం నగరంలోని బాల మందిరాన్ని జిల్లా ఎస్పీ వేదమూర్తి తదితరులతో కలిసి పరిశీలించారు. నిందితునిపై కేసు నమోదు చేసి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రిమాండ్ హోం అధికారులు సయ్యద్ పాషా, గురు ప్రసాద్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment