జీ20 సమ్మిట్‌ విషయంలో మోదీపై షారుక్‌ ట్వీట్‌ వైరల్‌ | Shah Rukh Khan Extends Congratulations To PM Modi On G20 Summit | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: జీ20 సమ్మిట్‌ విషయంలో మోదీపై షారుక్‌ ట్వీట్‌ వైరల్‌

Published Mon, Sep 11 2023 11:00 AM | Last Updated on Mon, Sep 11 2023 11:13 AM

Shah Rukh Khan Congratulations To Narendra Modi On G20 - Sakshi

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న జవాన్ సినిమా వజయంతో షారుక్‌ ఖాన్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. జీ20 సదస్సు  విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి షారుక్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును విజయవంతం చేసినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని సోషల్‌ మీడియా ద్వారా ఆయన తెలిపారు. 'ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం అన్ని దేశాల మధ్య ఐక్యతను పెంపొందించినందుకు మోదీకి అభినందనలు అని షారుక్‌ కొనియాడారు.

(ఇదీ చదవండి: లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్‌)

దేశ శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని SRK చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో చారిత్రాత్మక జీ20 సదస్సు ముగియడంతో షారుక్ ఖాన్ ప్రధాని గురించి ఇలా చెప్పారు. 'ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం, గర్వాన్ని సృష్టించింది. సార్, మీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐక్యంగా అభివృద్ధి చెందుతాము. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అని షారుక్‌ తన ట్వటర్‌ (ఎక్స్‌)లో రాశారు. 

పఠాన్ తర్వాత బాలీవుడ్ బాద్ షా మరో బ్లాక్ బస్టర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 500 కోట్ల మార్క్‌ను జవాన్‌ దాటింది. అట్లీ యాక్షన్‌ కట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే సంవత్సరంలో రెండు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత SRKకి ఉంది. SRK తో పాటు, నటుడు విజయ్ సేతుపతి, నటి నయనతార కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమతో కలిసి షారూక్‌ తీసిన మొదటి సినిమా ఇది. తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు చాలా విజయవంతమైంది. పలు కీలక అంశాలపై ఆ సదస్సులో చర్చించారు. తదుపరి సమావేశానికి బ్రెజిల్ బాధ్యత వహిస్తుంది. డిసెంబర్ 1న సమాఖ్య అధ్యక్ష పదవిని బ్రెజిల్ అధికారికంగా చేపట్టనుంది.

(ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్‌' రికార్డ్‌.. కోట్లు కొల్లగొట్టిన షారుక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement