కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్‌' రికార్డ్‌.. కోట్లు కొల్లగొట్టిన షారుక్‌ | Jawan Record 500 Cr Box Office Collection In Just 4 Days | Sakshi
Sakshi News home page

Jawan Collection Day 4:కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్‌' రికార్డ్‌.. కోట్లు కొల్లగొట్టిన షారుక్‌

Published Mon, Sep 11 2023 9:08 AM | Last Updated on Mon, Sep 11 2023 9:31 AM

Jawan 500CR Collection Mark Cross Just 4 Days - Sakshi

• నాలుగు రోజుల్లో 'జవాన్‌'కు రూ. 500 కోట్లు
• ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు

• షారుక్‌ తర్వాతి సినిమా ఇదే

ఈ ఏడాదిలో  పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్​ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్‌ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్‌లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్​లను అందుకుంటూ బాలీవుడ్‌లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.  సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్​ ఇచ్చి పఠాన్​తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి)

దీంతో బాలీవుడ్‌ బాద్‌ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్​లోనే సెప్టెంబర్ 7న జవాన్​గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్‌ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరడంతో షారుక్‌ రికార్డుకెక్కాడు.

కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్‌ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో  లాంగ్ రన్ టైమ్​లో జవాన్‌ రూ.1000 కోట్ల మార్క్‌ను పక్కాగా దాటుతుందని  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్​ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్​ అందుకున్నట్టే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement