జవాన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సుప‍్రీం హీరో సాయి ధరమ్ తేజ్, తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారట. సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తున్నాడు.
ముందుగా ఈ సినిమాకు ఇంటలిజెంట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈసినిమా మరీ క‍్లాస్ అయ్యిందన్న టాక్ రావటంతో ఇప్పుడు ధర్మా భాయ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. యాక్షన్ జానర్ సినిమా కావటంతో పాటు వినాయక్ ఇమేజ్ కు కూడా ఈ టైటిల్ అయితే నే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఇప్పటివరకు చిత్రయూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ధర్మా భాయ్ కే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment