
సాయి ధరమ్ తేజ్
మెగా వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటిన సాయి ధరమ్, తరువాత కష్టాల్లో పడ్డాడు. రొటీన్ మాస్ ఫార్ములా సినిమాలు చేస్తూ అభిమానులకు బోర్ కొట్టించాడు. అందుకే కాస్త డిఫరెంట్ గా ఓ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు సాయి ధరమ్‌తేజ్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తెరకెక్కించే కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘దేవుడు వరమందిస్తే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. 2001లో రోహిత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘6టీన్స్’ సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవి దేవుడు వరమందిస్తే. ఇన్నేళ్ల తరువాత ఆ పల్లవిని టైటిల్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment