‘త్వరలో ఆ సూపర్‌ హిట్‌కు సీక్వల్‌’ | VV Vinayak says about Adhurs 2 | Sakshi
Sakshi News home page

Feb 7 2018 1:08 PM | Updated on Feb 7 2018 1:10 PM

VV Vinayak - Sakshi

దర్శకుడు వివి వినాయక్‌

మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా అదుర్స్‌. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో రికార్డ్‌లను తిరగ రాసింది. తరువాత చాలా సందర్భాల్లో ఈ సినిమాకు సీక‍్వల్‌ ఉంటుందంటూ వినాయక్‌ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్‌’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మరోసారి వినాయక్‌ అదుర్స్‌ సీక్వల్‌ ప్రస్తావన తీసుకువచ్చారు. ‘గతంలోనే అదుర్స్‌ సీక్వల్‌ కు ప్రయత్నాలు జరిగినా అది సాధ‍్యం కాలేదు. కానీ తప్పకుండా అదుర్స్‌ సీక్వల్‌ చేస్తాన’ని అన్నారు.  సాయి ధరమ్ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఇంటిలిజెంట్‌ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement