సాయి ధరమ్ తేజ్
మెగా ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఈ శుక్రవారం ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ మెగా హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న సాయి ధరమ్ తేజ్‌ను డిఫరెంట్ సినిమాలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘దర్శకులెవరు నా దగ్గరకు అలాంటి కథలు తీసుకురావటంలేదు. నేను కూడా కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సమాధానమిచ్చారు.
వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి, ఇంటిలిజెంట్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వినాయక్ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment