మెగా హీరోకు ప్రభాస్‌ హెల్ప్‌ | Prabhas to unveil inttelligent Movie Song | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 28 2018 1:32 PM | Last Updated on Sun, Jan 28 2018 1:33 PM

Prabhas to unveil inttelligent Song - Sakshi

ప్రభాస్‌ చేతుల మీదుగా ‘ఇంటిలిజెంట్‌’ ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లీడ్‌ రోల్‌లో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇంటిలిజెంట్‌. సికె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌కు మరో స్టార్ హీరో సాయం చేయనున్నాడు.

ఇంటిలిజెంట్‌ సినిమాలో తొలి సింగిల్‌ను బాహుబలి స్టార్ ప్రభాస్‌ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయత్రం 4 గంటలకు ఈ పాట సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement