వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం మాస్ సినిమా దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రయూనిట్.
ముందుగా ఈ సినిమాకు ధర్మాభాయ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఇంటెలిజెంట్’ అనే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. హీరో విలన్‌ల మధ్య మైండ్ గేమ్ తో సాగే కథ కావడంతో ఇంటెలిజెంట్ అనే టైటిలే కరెక్ట్ అని భావిస్తున్నారట. త్వరలోనే టైటిల్ ను ఫైనల్ చేసి అధికారిక ప్రకటన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment