
మెగా వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న సాయి తరువాత తడబడ్డాడు. తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం రచయిత బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు.
ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. తనకు విన్నర్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడట. ఈ సినిమాను భగవాన్, పుల్లారావులు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment