
ఈ మధ్య మెగా హీరోల్లో అసలు టైమ్ కలిసిరానిది సాయిధరమ్‌తేజ్‌కే. రామ్ చరణ్, వరుణ్ తేజ్ విజయాలతో దూసుకెళ్తుంటే.. ఈ హీరో మాత్రం విజయాన్ని చూసి చాలా కాలమైంది. సుప్రీం సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు ఈ హీరో ఖాతాలో. రీసెంట్‌గా వచ్చిన ఇంటెలిజెంట్ దారుణంగా బెడిసికొట్టింది.
మాస్ మంత్రం జపిస్తూ... ఒకే ధోరణిలో సినిమా చేస్తున్న ఈ సుప్రీం హీరో ప్రస్తుతం ట్రాక్ మార్చినట్టు కనిపిస్తోంది. కరుణాకరన్‌తో తేజ్ ఐలవ్‌యూ, కిషోర్‌తిరుమలతో మరో లవ్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. విన్నర్ లాంటి డిజాస్టర్‌ను ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్టును చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కామెడీ, మాస్ అంటూ సినిమాలు చేసే ఈ డైరెక్టర్ మరి ఈ సారి ఈ హీరోను ఎలా చూపిస్తారో..వేచి చూడాలి. జె.భగవాన్– జె.పుల్లారావు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment