Tej I LOVE YOU Review, in Telugu | తేజ్‌ ఐ లవ్‌ యు మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 12:31 PM | Last Updated on Fri, Jul 6 2018 2:03 PM

Tej I Love You Telugu Movie Review - Sakshi

టైటిల్ : తేజ్‌ ఐ లవ్‌ యు
జానర్ : రొమాంటిక్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌, జయ ప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, అనీష్‌ కురివిల్లా
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : కరుణాకరన్‌
నిర్మాత : కేయస్‌ రామారావు

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా.. తరువాత కెరీర్ గాడి తప్పింది. మాస్‌ హీరోయిజం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో.. ఈ సారి తేజ్‌ ఐ లవ్‌ యు అంటూ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి లవ్‌ స్టోరిలను తెరకెక్కించిన కరుణాకరన్‌ దర్శకత్వంలో లవర్‌బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కరుణాకరన్‌ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో రిజల్ట్ మీద ఆసక్తి నెలకొంది. మరి తేజ్ ఐ లవ్ యు ఈ ఇద్దరి కెరీర్‌లకు బ్రేక్‌ ఇచ్చిందా..?

కథ;
తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్‌) చిన్నతనంలోనే అమ్మానాన్నకు దూరం కావటంతో పెద్దమ్మ(పవిత్రా లోకేష్‌) పెదనాన్న(జయ ప్రకాష్‌), పిన్నీ బాబాయ్‌లు గారాభంగా చూసుకుంటుంటారు. కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకునే తేజ్‌, పదేళ్ల వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో హత్య చేసి జైలుకెళతాడు. (సాక్షి రివ్యూస్‌) ఏడేళ్ల శిక్ష తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రేమగా చూసుకుంటుంది. తేజ్‌ ప్రతీ పుట్టిన రోజును పండగలా చేస్తుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి గెంటేస్తారు.

ఇంట్లో నుంచి వచ్చేసిన తేజ్‌ హైదరాబాద్‌లోని బాబాయ్‌ (పృథ్వీ) ఇంట్లో ఉంటూ మ్యూజిక్‌ ట్రూప్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఓ కుర్రాడి అడ్రస్‌ కోసం వెతుకుతూ లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన నందిని (అనుపమా పరమేశ్వరన్‌)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు తేజ్‌. (సాక్షి రివ్యూస్‌)నందిని కూడా తేజ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ తేజ్‌కు తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న సమయంలో ఓ యాక్సిడెంట్‌లో నందిని గతం మర్చిపోతుంది. నందినికి తిరిగి గతం గుర్తుకు వచ్చిందా..? నందిని లండన్‌ నుంచి ఇండియాకు ఎవరి కోసం వచ్చింది..? నందిని, తేజ్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్ హీరో రోల్స్‌ లో మెప్పించిన సాయి ధరమ్‌ తేజ్‌ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్‌ చేస్తే బాగుండేది. (సాక్షి రివ్యూస్‌)తెర మీద తేజ్‌ చాలా బొద్దుగా కనిపించాడు. అంతేకాదు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఇమిట్‌ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్‌ను పక్కన పెట్టి మోడ్రన్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది. 30 ఇయర్స్‌ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ ;
కరుణాకరన్ సినిమా అంటే యూత్‌ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కరుణాకరన్ ఇటీవల ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నాడు. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మరోసారి కరుణాకరన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తన హిట్‌ చిత్రాల స్థాయిలో ఎమోషన్స్‌ను పండించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్‌) చాలా చోట్ల కరుణాకరన్‌ గత చిత్రాల ఛాయలు కనిపించటం కూడా ఇబ్బంది పెడుతుంది. కథా పరంగా బలమైన ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా.. సాదాసీదా కథనంతో నడిపించేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రేక్షకుడ్ని కథలో లీనం చేసే స్థాయి ఎమోషనల్‌ సీన్‌ ఒక్కటి కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ వర్క్‌ అవుట్ అయినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం చాలా ఇంపార్టెంట్‌. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్ గోపిసుందర్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
ఫ్యామిలీ ఎమోషన్స్‌
కొన్ని కామెడీ సీన్స్‌
హీరోయిన్‌ పాత్ర

మైనస్‌ పాయింట్స్‌ ;
సంగీతం
స్క్రీన్‌ ప్లే


సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.
                

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement