‘తేజ్‌’ ట్రైలర్‌ విడుదల  | Tej I Love You Trailer Released | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 7:36 PM | Last Updated on Mon, Jun 25 2018 8:11 PM

Tej I Love You Trailer Released - Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం ఓ హిట్‌ కావాలి. మెగా హీరోల్లో గత కొంతకాలం పాటు విజయాలు లేక డీలాపడ్డాడు. వరుస డిజాస్టర్స్‌తో ఉన్న ఈ హీరో, తన టాలెంట్‌ని మళ్లీ ప్రూవ్‌ చేసుకోవాలని చూస్తోన్న డైరెక్టర్‌ కరుణాకరన్‌తో కలిసి తీసిన సినిమా ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’. 

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌, లుక్స్‌, పాటలకు సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ కామెంట్సే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటకు మంచి మార్కులే పడుతున్నాయి. గోపి సుందర్‌ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మించిన ఈ సినిమా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement