సాక్షి, హైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు కరుణాకరన్, హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడతూ.. ‘ఈ సినిమా కరుణాకరన్ బ్రాండ్ తగినట్టు ఉంటుంది. అందమయిన లవ్ స్టోరీ తీశాం. అందమయిన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్‌లా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. హీరో తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో బాగా సక్సెస్ అయ్యింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. జులై 6న ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపారు. ఇది క్యూట్ సినిమా అని, తన లైఫ్‌లో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
Published Sat, Jun 16 2018 12:07 PM | Last Updated on Sat, Jun 16 2018 2:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment