‘తేజ్‌’పై చెర్రీ కామెంట్‌! | Ram Charan Comments On Tej I love You | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 1:53 PM | Last Updated on Thu, Jun 28 2018 2:10 PM

Ram Charan Comments On Tej I love You - Sakshi

కొంతకాలంగా మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్‌ మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని రొటీన్‌ కథలను ఎంచుకోకుండా...ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్‌ డైరెక్షన్‌లో ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యేలా చేశారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌దాటి ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌పై మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియాలో కామెంట్ చేశారు. ‘విజువల్స్‌, మ్యూజిక్‌ చాలా బాగున్నాయి. కరుణాకరన్‌ నుంచి హిట్‌ సినిమా రాబోతోంది. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. కేయస్‌ రామారావు, సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. రామ్‌ చరణ్‌కు సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌లు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement