బావ.. బావమరిది.. సిటీలో సందడి | Ram Charan Inaugurates Happi Mobile Stores | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 8:55 AM | Last Updated on Sat, Jun 9 2018 8:55 AM

Ram Charan Inaugurates Happi Mobile Stores - Sakshi

మెగా హీరోలు రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్‌లు శుక్రవారం సిటీలో సందడి చేశారు. చందానగర్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్‌ అభిమానులను పలకరిస్తూ..వారితో ఫొటోలు దిగారు. కూకట్‌పల్లిలో సాయిధరమ్‌ తేజ్‌ తన మూవీ ‘తేజ్‌’ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుపమా పరమేశ్వరన్‌తో సెల్ఫీలు దిగారు.       

కూకట్‌పల్లిలో తేజ్‌ సందడి 
మూసాపేట : కూకట్‌పల్లిలోని లాట్‌ మొబైల్‌ షోరూమ్‌లో శుక్రవారం ‘తేజ్‌’ సినిమా నటీనటులు సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌లు సందడి చేశారు.  తేజ్‌ ఐ లవ్‌యు సినిమాలోని ‘నచ్చుతుందే..’ పాటను విడుదల చేశారు.  అనంతరం తేజ్‌ లాట్‌ మొబైల్‌ ఆఫర్స్‌ను ఆవిష్కరించారు. క్రియేటివ్‌ బ్యానర్స్‌ ఎంతో చరిత్ర గలదని, ఈ బ్యానర్‌లో పనిచేయటం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్‌ కరుణాకర్, నిర్మాత కె.ఎస్‌.రామారావు, లాట్‌ మొబైల్‌ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. 

హ్యాపీ మొబైల్‌ స్టోర్‌ ప్రారంభించిన చెర్రీ
చందానగర్‌ : హీరో రామ్‌చరణ్‌ రాకతో చందానగర్‌లో సందడి నెలకొంది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్‌ మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్‌ను రామ్‌చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా హ్యాపీ మొబైల్స్‌ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. అభిమానుల మధ్య హ్యాపీ మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ నగరంలో సంచలనాత్మక రీతిలో ఒకే రోజు 20 షోరూంలను ప్రారంభిస్తున్నామని హ్యాపీ మొబైల్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణపవన్‌ తెలిపారు. మెగా ఆఫర్‌ ప్రారంభించిన మొదటి నెల రోజులు రెండు కోట్ల విలువ గల బహుమతులు, ప్రతి కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement