happi mobiles
-
సంక్రాంతి అంటే ‘హ్యాపీ’ డిస్కౌంట్ ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యాపీ మొబైల్ స్టోర్స్ సంక్రాంతి పండుగకి ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఎటువంటి లక్కీడ్రాలు లేకుండా ఒక కచ్చితమైన బహుమతిని, 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఎంఐ, టీసీఎల్, ఎల్జీ, రియల్‌మి ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ‘‘సంక్రాంతి అంటే హ్యాపీయే’’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రతి ఇంటి ఆనందాన్ని నింపాలనే లక్ష్యంతో ఉన్నట్లు సంస్థ అధినేత శ్రీ కృష్ణ పవన్ అన్నారు. -
హ్యాపితో పండుగ సంతోషం రెట్టింపు (స్పాన్సర్డ్)
పండుగలు సంతోషం తీసుకువస్తాయి.. వాటిని మేం మరింత ఉత్తేజభరితం చేస్తాం! హ్యాపితో పండగ సీజన్లు కేవలం సంతోషాలను ప్రసరింపచేయడమే కాకుండా, మన వద్ద ఉన్నది షేర్ చేసేందుకు కూడా ఇది అనువైన సమయమని నమ్ముతాం భారత సంపద్రాయాలు భారీ వేడుకలను అభిలషిస్తాయి.. వాటిని చేపట్టేందుకు మేం సిద్ధం చూడండి.. హ్యాపి మొబైల్స్‌లో ఆఫర్ల వరద పోటెత్తింది. మేం కేవలం సంతోషాలనే కాదు హ్యాపి మొబైల్స్‌తో విస్తృత శ్రేణి ప్రయోజనాలనూ కల్పిస్తాం. ఇక మీరు మీ గాడ్జెట్లను ఎక్కడి నుంచో కొనుగోలు చేయాలని కోరుకోరు. పలు ప్రయోజనాలతో మేం మీకు బై-బ్యాక్ ఆఫర్‌ను అందిస్తామని హామీ ఇస్తున్నాం. మీ వద్ద నగదు తక్కువగా ఉంటే జీరో డౌన్‌పేమెంట్ ఈఎంఐతో కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తాం. మీకు సాయపడేందుకు మేం అన్నిటికీ సంసిద్ధమై ఉన్నాం. కోవిడ్ నేపథ్యంలో రెండు గంటల్లోనే హోం డెలివరీ వంటి పలు ప్రయోజనాలతో హ్యాపి మొబైల్స్‌లో మీకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని జోడిస్తాం. మా ఇతర ప్రయోజనాలు, ఆఫర్లతో పాటు పండుగ నెలలో మీకోసం మేం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తాం. రూ 9999ల విలువైన కొనుగోలుపై మీకు రూ 1500 విలువైన అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్‌ను ఉచితంగా అందచేస్తాం. మీరు ఇక తదుపరి మీ ఫేవరెట్ షాపింగ్ గమ్యాన్ని నిర్ధారించుకునేందుకు సిద్ధమవుతారు. మీరు మా వద్ద చేపట్టే కొనుగోళ్లకు హ్యాపి మొబైల్స్ మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. హ్యాపి మొబైల్స్‌తో మీ డీల్ సులభతరం చేసేందుకు మేం కష్టపడి పనిచేస్తాం. అంతేకాదు తొలిసారి మావద్ద కొనుగోలు చేసే కస్టమర్లకు అత్యంత విలువను అందిస్తాం. మీరు - ‘HAPPI’ ఈ కోడ్‌ను ఉపయోగించి ముందుకెళ్లండి! హ్యాపి మొబైల్స్‌లో మీ తొలి కొనుగోలుతో అన్ని ఉత్పత్తులపై రూ 200 ఆఫర్‌ను ఆస్వాదించండి. హెచ్డీఎఫ్సీ కస్టమర్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం. మా డీల్స్ ఆఫర్లతో, మీరు ప్రేమించే వారిని ఆనందంలో ముంచెత్తండి. మీరు, మీరు ప్రేమించేవారు కోరుకునే సంతోషాన్ని ఆస్వాదించండి. తాజా గాడ్జెట్స్‌పై మేం అందించే ఆఫర్లను వీక్షించేందుకు మా వెబ్సైట్ హ్యాపి మొబైల్స్ ను సంప్రదించండి. లేదా మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. హ్యాపి మొబైల్స్‌తో మీ పండుగ షాపింగ్‌ను మెరుగ్గా ఆస్వాదించండి. -
‘మా’ విభేదాలపై స్పందించిన రామ్‌చరణ్
సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చెప్పారు. బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. హ్యాపీ మొబైల్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడకు ఎప్పుడు వచ్చినా ఆనందంగా ఫీలవుతానని చెప్పారు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ 65 శాతం పూర్తైందని, జూలై 30న ఈ సినిమా విడుదలవుతుందని తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రిరిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరుకావడంపై స్పందిస్తూ.. సూపర్‌స్టార్ మూవీకి మెగాస్టార్ లాంటి వ్యక్తి వెళ్ళడం మంచి పరిణామని వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్ధికంగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటులు టాలీవుడ్‌కు వస్తుంటే మనం అక్కడికి ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టార్ల హవా నడుస్తుందని, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ రామ్‌చరణ్ శుభాకాంక్షలు చెప్పారు. కాగా, హీరో రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హ్యాపీ మొబైల్స్ రూ.5 కోట్ల బహుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ దసరా, దీపావళి సందర్భంగా మెగా ఫెస్టివ్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల విలువైన బహుమతులను కస్టమర్లకు అందించనుంది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చిత బహుమతి ఉందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. సినీ నటి కాజల్ అగర్వాల్, కంపెనీ ఈడీ కోట సంతోష్, డైరెక్టర్ చరణ్‌తో కలిసి ఆఫర్లను వెల్లడించారు. ‘ఆన్లైన్ కంటే ఉత్తమ ధరలో విక్రయిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా జరిపే కొనుగోలుపై 20 శాతం, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. రూ.9,999 విలువైన ఫోన్ కొంటే రూ.8,549 విలువ గల మైక్రోమ్యాక్స్ ఎల్ఈడీ టీవీ, రూ.13,990 విలువ గల మొబైల్‌పై రూ.7,900 విలువైన క్రాంప్టన్ కూలర్ ఉచితం. శామ్సంగ్ నోట్ 10 లేదా నోట్ 10 ప్లస్‌పై రూ.6,000 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఓపో రెనో–2, వివో వి–17 ప్రో మోడళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 3జీబీ ర్యామ్ నోకియా–3 ధర రూ.5,999 ఉంది’ అని వివరించారు. -
హ్యాపీ లావణ్యం
-
సిటీలో సందడి చేసిన రష్మిక
-
‘హ్యాపీ మొబైల్స్’.. ఒకే రోజు 20 స్టోర్లు
హెదరాబాద్: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ దుకాణాల సంస్థ ‘హ్యాపీ మొబైల్స్’ ఒకే రోజున శుక్రవారం హైదరాబాద్‌లో కొత్తగా 20 స్టోర్లను ప్రారంభించింది. చందానగర్ స్టోర్‌ను ప్రముఖ నటుడు రామ్‌చరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ పవన్, డైరెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. కస్టమర్లకు మొబైల్స్ కొనుగోలు విషయంలో సరికొత్త అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ తొలి ఏడాదిలోనే 150–200 స్టోర్లను ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. -
బావ.. బావమరిది.. సిటీలో సందడి
మెగా హీరోలు రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్‌లు శుక్రవారం సిటీలో సందడి చేశారు. చందానగర్‌లో ఓ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్ అభిమానులను పలకరిస్తూ..వారితో ఫొటోలు దిగారు. కూకట్‌పల్లిలో సాయిధరమ్ తేజ్ తన మూవీ ‘తేజ్’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుపమా పరమేశ్వరన్తో సెల్ఫీలు దిగారు. కూకట్‌పల్లిలో తేజ్ సందడి మూసాపేట : కూకట్‌పల్లిలోని లాట్ మొబైల్ షోరూమ్‌లో శుక్రవారం ‘తేజ్’ సినిమా నటీనటులు సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌లు సందడి చేశారు. తేజ్ ఐ లవ్యు సినిమాలోని ‘నచ్చుతుందే..’ పాటను విడుదల చేశారు. అనంతరం తేజ్ లాట్ మొబైల్ ఆఫర్స్‌ను ఆవిష్కరించారు. క్రియేటివ్ బ్యానర్స్ ఎంతో చరిత్ర గలదని, ఈ బ్యానర్లో పనిచేయటం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ కరుణాకర్, నిర్మాత కె.ఎస్.రామారావు, లాట్ మొబైల్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. హ్యాపీ మొబైల్ స్టోర్ ప్రారంభించిన చెర్రీ చందానగర్ : హీరో రామ్‌చరణ్ రాకతో చందానగర్‌లో సందడి నెలకొంది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్‌ను రామ్‌చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా హ్యాపీ మొబైల్స్ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. అభిమానుల మధ్య హ్యాపీ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో సంచలనాత్మక రీతిలో ఒకే రోజు 20 షోరూంలను ప్రారంభిస్తున్నామని హ్యాపీ మొబైల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణపవన్ తెలిపారు. మెగా ఆఫర్ ప్రారంభించిన మొదటి నెల రోజులు రెండు కోట్ల విలువ గల బహుమతులు, ప్రతి కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నామని చెప్పారు. -
మార్చి నాటికి 150 ‘హ్యాపీ’ స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘హ్యాపీ’ మొబైల్స్ ప్రచారకర్తగా సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ వ్యవహరిస్తారు. 18 నెలలపాటు ఆయన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. గురువారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కంపెనీ సీఎండీ కృష్ణ పవన్ మీడియాతో ఈ విషయం చెప్పారు. మార్చి నాటికి మొత్తం 150 స్టోర్లను తెరుస్తామని వెల్లడించారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తున్నాం. జూన్ తొలి వారంలో ఒకేరోజు హైదరాబాద్‌లో 20 ఔట్లెట్లను ప్రారంభించనున్నాం’’ అని తెలియజేశారు. వాయిదాల్లో మొబైల్ కొనాలనుకునే ఉద్యోగులు లేదా వ్యాపారులు తమ స్టోర్‌కు ఆధార్ కార్డుతో వస్తే చాలని కంపెనీ ఈడీ కోట సంతోష్ తెలిపారు. వారి ఆదాయం ఆధారంగా ఈఎమ్ఐ ఆధారపడి ఉంటుందన్నారు. త్వరలో ఫౌండేషన్.. సేవా కార్యక్రమాల కోసం త్వరలో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పారు. ‘హ్యపీ మొబైల్స్ ప్రచార కర్తగా ఉండడం సంతోషంగా ఉంది. ఫౌండేషన్ గురించి ముందే చెప్పకూడదనుకున్నా. ఇదే మంచి సమయమని చెబుతున్నా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా ఉండాలని ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టాం. ప్రచారకర్తగా వివిధ బ్రాండ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15–20 శాతం ఈ సంస్థకు కేటాయిస్తా’ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే ఆయన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.