హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు | happi Mobiles Offers on This Festival Season | Sakshi
Sakshi News home page

హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు

Published Fri, Oct 4 2019 10:15 AM | Last Updated on Fri, Oct 4 2019 10:15 AM

happi Mobiles Offers on This Festival Season - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ హ్యాపీ మొబైల్స్‌ దసరా, దీపావళి సందర్భంగా మెగా ఫెస్టివ్‌ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల విలువైన బహుమతులను కస్టమర్లకు అందించనుంది. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై కచ్చిత బహుమతి ఉందని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. సినీ నటి కాజల్‌ అగర్వాల్, కంపెనీ ఈడీ కోట సంతోష్, డైరెక్టర్‌ చరణ్‌తో కలిసి ఆఫర్లను వెల్లడించారు. ‘ఆన్‌లైన్‌ కంటే ఉత్తమ ధరలో విక్రయిస్తున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా జరిపే కొనుగోలుపై 20 శాతం, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంది. రూ.9,999 విలువైన ఫోన్‌ కొంటే రూ.8,549 విలువ గల మైక్రోమ్యాక్స్‌ ఎల్‌ఈడీ టీవీ, రూ.13,990 విలువ గల మొబైల్‌పై రూ.7,900 విలువైన క్రాంప్టన్‌ కూలర్‌ ఉచితం. శామ్‌సంగ్‌ నోట్‌ 10 లేదా నోట్‌ 10 ప్లస్‌పై రూ.6,000 క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. ఓపో రెనో–2, వివో వి–17 ప్రో మోడళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌ నోకియా–3 ధర రూ.5,999 ఉంది’ అని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement