
ఉచిత ప్రమాద బీమాతో ‘లెనోవో’
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగలు సమీపిస్తుండటంతో లెనోవో సంస్థ అమ్మకాలు పెంచుకోవటానికి కొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రీమియం లెనోవో ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసినవారికి రెండేళ్ల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, రెండేళ్ల అదనపు వారెంటీ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అనుకోకుండా కింద పడటం, విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల దెబ్బతినటంతో పాటు రిపేరు సాధ్యంకాని డ్యామేజీ జరిగితే ఈ ప్రొటెక్షన్ పనికొస్తుందని కంపెనీ పేర్కొంది.