దీపావళి వస్తే వ్యాపారాలకు పండగే. ఎందుకంటే గృహాలంకరణ, దుస్తులు, టపాకాయలంటూ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తుంటారు. అందుకే వ్యాపారులు ఈ సమయాన్ని ముఖ్యంగా భావిస్తారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా తెరపైకి వచ్చేస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా ఉన్న వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు మొదలైన వారికి విక్రయాలకు పండగ సీజన్‌లు ఎంతగానో దోహదపడతాయి.
ఈ ఏడాది పండగ సందర్భంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, దేశంలో ఇప్పటికే 1.25 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) తెలిపింది. అయితే దీపావళి సేల్‌లో మొత్తం వ్యాపారం 1.50 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
శతాబ్దాలుగా భారతదేశంలోని వ్యాపారులు దీపావళి సందర్భంగా వారి వ్యాపార సంస్థలలో దీపావళి పూజను సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా వ్యాపారాలు డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పోర్టల్ కూడా తోడవడంతో ఇప్పుడు అన్ని వ్యాపారాలు జీఎస్టీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు దీపావళి పూజలో.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను పూజిస్తారు. మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ నగదు టెల్లర్లు, డిజిటల్ చెల్లింపులను మొదలైనవాటిని కూడా దీపావళి పూజలో చేర్చారు.
చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
Comments
Please login to add a commentAdd a comment