సాక్షి, అమరావతి: . ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సెలవు తేదీని ప్రభుత్వం మార్చింది. ఈ నెల 13వ తేదీ(సోమవారం) దీపావళి సెలవు ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12న (ఆదివారం) దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలువుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇక 13వ తేదీన ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment