Diwali holiday
-
ఏపీలో దీపావళి సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: . ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సెలవు తేదీని ప్రభుత్వం మార్చింది. ఈ నెల 13వ తేదీ(సోమవారం) దీపావళి సెలవు ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12న (ఆదివారం) దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలువుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 13వ తేదీన ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో జవాను కాల్పుల కలకలం
న్యూఢిల్లీ/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు తోటి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మారాయిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలోని సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ సీ–కంపెనీ వద్ద సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కాగా, కాల్పులు జరిపిన జవాను రీతేశ్ రంజన్(25) తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, మానసిక సమతౌల్యం దెబ్బతినడంతో నిద్రిస్తున్న తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడని సీఆర్పీఎఫ్ సోమవారం స్పష్టంచేసింది. అతను 13వ తేదీ నుంచి సెలవుపై వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత బదిలీపై జమ్మూకశ్మీర్‌లోని మరో బెటాలియన్‌లో చేరాల్సి ఉందని తెలిపింది. అయితే, కాల్పుల ఘటనపై మరో వాదన వినిపిస్తోంది. ఈ బెటాలియన్‌లో బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన జవాన్లు ఉన్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయమై వాగ్వాదం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. వెంటనే బిహార్‌కు చెందిన జవాను రీతేశ్ రంజన్ తన ఏకే–47 సర్వీస్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో బిహార్‌కు చెందిన రాజ్ మణి కుమార్ యాదవ్, ధాంజీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజీవ్ మోండల్, ధర్మేంద్ర కుమార్ మృతి చెందారు. కాల్పులు జరిపినపుడు అదే బ్యారక్‌లో దాదాపు 45 మంది జవాన్లు నిద్రిస్తున్నారు. కాల్పుల్లో మరో ముగ్గురికి బుల్లెట్ల గాయాలయ్యాయి. వీరిని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో వెంటనే సీఆర్పీఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో వారిని రాయ్‌పూర్ తరలించారు. కాల్పులకు పాల్పడిన రంజన్‌ను సీఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఘటనపై మారాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సీఆర్పీఎఫ్ ఆదేశించింది. ఘటనపై సీఎం భగేల్ విచారం వ్యక్తంచేశారు. -
దీపావళి సెలవుల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. మొదట ప్రకటించిన ఐచ్ఛిక సెలవు, దీపావళి సెలవులను మార్చింది. గతంలో 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై పండితులు, ఉద్యోగులు, అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండగ సెలవు తేదీని 19కి మార్చాలంటూ పలువురు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఐచ్ఛిక సెలవును 18కి, సాధారణ సెలవును 19కి మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. -
యూఎస్ ‘స్కూల్’లో దీపావళి
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ పండుగకు గుర్తింపు లభించింది. ఆ దేశంలోని హోవార్డ్ కౌంటీలోని పబ్లిక్ స్కూల్ వ్యవస్థ రూపొందించే క్యాలెండర్లో దీపావళికి చోటు లభించింది. దీనితోపాటు ఈద్ అల్ అధా, చైనా కొత్త సంవత్సరాదిని కూడా ఆ కౌంటీలోని స్కూళ్లకు సెలవుదినాలుగా పేర్కొంది.