ఫర్నిచర్‌ కొంటే ప్లాట్‌, కారు, యాక్టివా | Bantia Furniture Showroom Offers on Festival Season | Sakshi
Sakshi News home page

‘బాంటియా’ బంపర్‌ ఆఫర్లు

Published Sat, Oct 5 2019 10:16 AM | Last Updated on Sat, Oct 5 2019 1:10 PM

Bantia Furniture Showroom Offers on Festival Season - Sakshi

కంటోన్మెంట్‌ : బాంటియా ఫర్నిచర్‌ ఏటా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ఏడాది సాధారణంగా ఎవరైనా ఫ్లాట్‌/ప్లాట్‌ కొంటే నజరానాలు ప్రకటిస్తారు. అయితే బాంటియా ఫర్నిచర్‌ షోరూం తమ కస్టమర్లకు ఫ్లాట్‌/ప్లాట్‌లు ఉచితం అని ప్రకటింది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆల్టో కారు, యాక్టివా స్కీములకు తో డుగా ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 

ఫర్నిచర్‌ కొంటే ప్లాట్‌/ ఫ్లాట్‌  
బాంటియా షోరూంలలో రూ.4.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్, రూ.3.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి 100 గజాల ప్లాటు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యాదగిరి గుట్ట సమీపంలోని దత్తాయిపల్లి గ్రామ పరిధిలో డీటీసీపీ అప్రూవ్డ్‌ లే–అవుట్‌లో నిర్ణీత రిజిస్ట్రేషన్, డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించిన వారికి ఫర్నిచర్‌తో పాటే ఆయా ఫ్లాట్‌/ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తారు. రూ.2.99 లక్షల ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తే బీఎస్‌–6, 2019 మోడల్‌ ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ కారు, రూ.99 వేల ఫర్నిచర్‌ కొనుగోలుపై హోండా యాక్టివా లేదా వెస్పాను ఉచితంగా పొందవచ్చు. ఎంపిక చేసిన రిక్లైనర్‌ సోఫా సెట్‌తో పాటు రూ.55 ఇంచుల ఎల్‌ఈడీ టీవీని సైతం ఉచితంగా అందజేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి నిర్ణీత మొత్తానికి ఎంఆర్‌పీ ధరల్లో ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి ఆయా ఆఫర్లు అందజేయనున్నారు. రూ.1 మాత్రమే చెల్లించి, మిగతామొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకల్పిస్తున్నారు. పేటీఎం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు వీటికిఅదనం. 

1950లోనే విక్రయాలు ప్రారంభం  
69 ఏళ్ల క్రితం రాణిగంజ్‌ ప్రాంతంలో చిన్న షాపుగా మొదలైన బాంటియా ఫర్నిచర్స్‌ దినదినాభివృద్ధి చెందుతూ నేడు 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 షోరూములతో నగరంలోనే ప్రముఖ ఫర్నిచర్‌ షాపుల్లో ఒకటిగా పేరొందింది. మొదట్లో స్టీలు ఫర్నిచర్‌ మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించేవారు. ప్రస్తుతం టేక్‌వుడ్, రబ్బర్‌ వుడ్, ఎండీఎఫ్, స్టీల్, స్టెయిన్‌లెస్‌ స్టీల్, గ్లాస్‌ మార్బుల్, గ్లాస్, స్టీల్, బెండ్‌ గ్లాస్, వుడ్, ఎండీఎఫ్‌ వంటి విభిన్న మెటీరియల్స్‌తో రూపొందించిన ఫర్నిచర్‌ను విక్రయిస్తోంది. 150 ఏళ్లక్రితమే నగరానికి వచ్చిస్థిరపడిన బాంటియా కుటుంబం 1950లో తొలిసారిగా ఫర్నిచర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులో ప్రేమ్‌ చంద్‌ బాంటియా స్టీల్‌ ఫర్నిచర్‌ దుకాణాన్ని తెరిచారు. తొలుత ఆటుపొట్లను తట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నిచర్‌ సప్లయర్‌గా మారి వ్యాపారం నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సురేంద్ర బాంటియా, మనవడు అమిత్‌ బాంటియా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలో 10 బ్రాంచీలతో దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ ఫర్నిచర్‌ గ్రూపుగా కొనసాగుతున్న బాంటియా ఫర్నిచర్స్‌ యజమానులు సురేంద్ర, అమిత్‌ ‘సాక్షి’తో తమ ప్రస్థానంపై ముచ్చటించారు. 

వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా...
మారుతున్న వినియోగదారులకు అభిరుచులు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు, విక్రయాల్లో మార్పులు తెస్తూ ఉండటం వల్లే తాము ప్రస్తుతం ఫర్నిచర్‌రంగంలో ప్రముఖ సంస్థగా ఎదగగలిగామన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే అన్ని రకాల ఫర్నిచర్‌ ఉత్పత్తులను సరసమైన ధరల్లో తమ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నో వెరైటీలు...
లెథర్, ఫ్యాబ్రిక్, రిక్లయినర్, లౌంగర్, స్లీక్, కార్వ్‌డ్‌ తదితర మోడళ్లలో ఉత్తమ క్వాలిటీతో తమ వద్ద రూ.10 వేల నుంచి రూ.5.5లక్షల విలువ చేసే సోఫాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.  

త్వరలో దేశ వ్యాప్తంగా బ్రాంచీలు
రాణిగంజ్‌ నుంచి సిఖ్‌రోడ్‌లోని ప్రస్తుత బాంటియా షోరూముకు తమ వ్యాపార కేంద్రాన్ని మార్చిన నిర్వాహకులు ఆ తర్వాత కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌/ మలక్‌పేట, కొంపల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్, ఎఎస్‌ రావు నగర్, బోడుప్పల్, కర్మన్‌ఘాట్, నాగోల్‌లో  పెద్ద షోరూములను నెలకొల్పారు. త్వరలోనే కరీంనగర్, వరంగలో కొత్త షోరూములు ఏర్పాటు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement