‘తేజ్‌’ వాయిదా పడిందా! | Is Sai Dharam Tej New Movie Tej I love You Postponed | Sakshi
Sakshi News home page

‘తేజ్‌’ వాయిదా పడిందా!

Published Mon, Jun 11 2018 8:03 PM | Last Updated on Mon, Jun 11 2018 8:14 PM

Is Sai Dharam Tej New Movie Tej I love You Postponed - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సరైన హిట్‌ లేక సతమతమవుతున్నారు. సాయిధరమ్‌ ‘సుప్రీం’ సినిమా తరువాత వచ్చిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే డైరెక్టర్‌ కరుణాకరన్‌తో ‘తేజ్‌ ఐ లవ్‌ యూ అనే సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్‌​ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొదటగా జూన్‌ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌. ముందు అనుకున్న తేదీ కాకుండా జూలై​ 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాయి ధరమ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుండగా, ఈ మూవీకి గోపి సుందర్‌ సంగీతాన్ని అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement