‘విన్నర్’ సినిమా షూటింగ్ సమయంలో సాయి ధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను మే లో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి ధరమ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇటీవల ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో త్వరలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ బాలజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మించనున్నారు.
గతంలో సాయి ధరమ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి గోపిచంద్ సినిమా చేసేందుకు అంగీకరించాడు సుప్రీం హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా నటీనటులు ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు సంగీతమందించనున్నట్టుగా తెలిపారు చిత్ర నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment