మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి.. | Border Force Jawan Gropes Woman In Manipur Store | Sakshi
Sakshi News home page

కెమెరా సాక్షిగా మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..

Published Tue, Jul 25 2023 6:30 PM | Last Updated on Tue, Jul 25 2023 8:00 PM

Border Force Jawan Gropes Woman In Manipur Store - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్ అల్లర్లలో రోజుకో అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. కెమెరా సాక్షిగా జవాన్ చేతిలో ఓ మహిళ ఇబ్బందులను ఎదుర్కొంది. కిరాణ స్టోర్‍ నుంచి ఓ మహిళను బీఎస్‌ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. మహిళ మెడపై జవాన్‌ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది. 

ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సీసీటీవీ వీడియో ప్రకారం.. ఓ బీఎస్‌ఎప్ జవాను రైఫిల్‌ను ధరించి ఉన్నాడు. ఓ కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను విచక్షణా రహితంగా బయటకు లాగాడు. జులై 20న ఈ ఘటన జరగగా.. నిందితునిపై కేసు నమోదు చేశారు. విధుల నుంచి తప్పించారు. నిందితున్ని సతీష్ ప్రసాద్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాక ఇప‍్పటికే అక్కడి పోలీసు స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చాలా స్టేషన్‌లలో జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కానీ వాటిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  సైబర్ సెల్ విభాగం దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తోంది.  
ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్‌ఎఫ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement