Border forces
-
మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకో అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. కెమెరా సాక్షిగా జవాన్ చేతిలో ఓ మహిళ ఇబ్బందులను ఎదుర్కొంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఓ బీఎస్ఎప్ జవాను రైఫిల్‌ను ధరించి ఉన్నాడు. ఓ కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను విచక్షణా రహితంగా బయటకు లాగాడు. జులై 20న ఈ ఘటన జరగగా.. నిందితునిపై కేసు నమోదు చేశారు. విధుల నుంచి తప్పించారు. నిందితున్ని సతీష్ ప్రసాద్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాక ఇప్పటికే అక్కడి పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చాలా స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ వాటిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ సెల్ విభాగం దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. చర్చల అనంతరం మర్నాడు ఉదయానికి అది ముగిసింది. ఈ గొడవలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఓ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో రెండు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్థానిక స్థాయి చర్చల అనంతరం ఇరువర్గాలు వెనక్కు తగ్గాయన్నారు. ‘సరిహద్దు సమస్య తేలకపోవడంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ప్రాంతాల్లో తాత్కాలిక, చిన్నస్థాయి ఘర్షణలు సాధారణమే. సిబ్బంది ఆవేశపూరిత మనస్తత్వం వల్ల కూడా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలతో ముగుస్తాయి’ అని వివరించారు. భారత్, చైనాల మధ్య 2017లో డోక్లాం ట్రై జంక్షన్ వద్ద 73 రోజుల పాటు యుద్ధం స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖగా పేర్కొనే 3,488 కి.మీ. పొడవైన సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. ఐబీజీలు సిద్ధం : ఆర్మీ చీఫ్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్–ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు. -
లొంగిపోయారో..లైఫ్ రిస్కే..!!
సాక్షి, న్యూఢిల్లీ: ‘హాయ్ నేనొక చైనా విద్యార్థిని. నా స్టడీలో భాగంగా ఇండో-చైనా సరిహద్దులపై ఒక వ్యాసం తయారు చేయాల్సివుంది. మీకు ఇబ్బంది లేదనుకుంటే.. వారి దైనందిన జీవితానికి సంబంధించి కొంత సమాచారం ఇస్తారా? నా నుంచి మీకేదైనా సహాయం అవసరమైతే చెప్పండి. తప్పక చేస్తాను’. ఇలాంటి మాటలతో భారత జవాన్లతో దాయాది దేశం పాకిస్తాన్, పొరుగునున్న చైనా దేశాల గూఢచర్యం ముఠాలు స్నేహం చేస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియా కేంద్రంగా ఇలాంటి ధోరణి పెరిగిపోయిందనీ.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే మాదిరిగా సోషల్ మీడియా మారే ప్రమాదముందని భారతీయ పారామిలటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భద్రతా సిబ్బందితో రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా తమను తాము పరిచయం చేసుకుని స్నేహం పేరుతో చనువుగా ఉండి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించాలని చైనా, పాకిస్తాన్ గూఢచారులు యత్నిస్తున్నారని సోషల్‌మీడియా పర్యవేక్షణాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలపై ఈ విధమైన ఎత్తుగడలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. యూనిఫాంతో ఫోటోలు, వీడియోలు వద్దు.. ఉద్యోగ విషయాలు, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు. యూనిఫాం ధరించి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని భద్రతా సిబ్బందికి నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వీకాంటాక్ట్, క్యూజోన్, ఓడ్నోక్లాసినికి, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ వేదికల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. దేశ భద్రతకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించే యత్నం చేశాడనే ఆరోపణలపై ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు వల్ల మళ్లీ అలాంటి ఉదంతాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సైనికుల కదలికలపై దృష్టి.. ‘ఇప్పటి వరకు మా పర్యవేక్షణా, నిఘాల్లో తేలింది ఏంటంటే.. మన దేశానికి చెందిన సున్నితమైన, ఆందోళనకరమైన ప్రదేశాల్లో ఎంతమంది సైనికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా వారి కదలికలు ఏ వైపుగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు ఉపయోగిస్తున్న ఆయుధ సామాగ్రి విశేషాలను తస్కరించే యత్నాలు సోషల్ వేదికల ద్వారా జరుగుతున్నాయ’ని సైబర్ పాలసీ అడ్వయిజర్ సుబీమల్ భట్టాచార్ జీ చెప్పారు. -
ప్రియుడి కోసం సరిహద్దు 'గోడ' దూకడంతో..
వాషింగ్టన్: తన ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లిన ఓ యువతి అతడి కోసం ఏకంగా దేశ సరిహద్దు గోడ దూకేసింది. ప్రియుడి వరకూ అంతా ఓకే కానీ, గోడ దూకిన ప్రియురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైంది. ఆ వివరాళ్లోకెళ్తే.. మెక్సికోకు చెందిన 22 ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తి గాఢంగా ప్రేమించుకున్నారు. విహారానికి వెళ్లాలనుకున్న ఈ ప్రేమజంట మెక్సికో సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ప్రియుడి కోరిక మేరకు, అతడితో కలిసి అమెరికా-మెక్సికో సరిహద్దుకు చేరుకున్నారు. 20 అడుగుల ఎత్తున్న ప్రాంతం నుంచి దూకి అమెరికా ఇంపీరియల్ కౌంటీ ఆక్టోటిల్లోకి ప్రవేశించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అమెరికా బార్డర్ పాట్రోలింగ్ పోలీసులు వీరిని గమనించి అక్కడికి వచ్చి చూడగా యువతి తీవ్రంగా గాయపడి ఉన్నట్లు గుర్తించారు. ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా వెన్నెముకకు గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. మెక్సికో పోలీసులకు వీరిని అప్పగించగా ప్రియుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని మెక్సికో సరిహద్దు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సరిహద్దు వద్దకు విహారానికి వెళ్లిన తమ జంట పొరపాటున 20 అడుగుల ఎత్తు నుంచి అమెరికా భూభాగంలోకి జారి పడిపోయామని పోలీసులకు చెప్పారు. -
సరిహద్దు బలగాలకు ‘హై ఆల్టిట్యూడ్ మెడల్’
అమరుల కుటుంబాలకు ఇకపై రూ.25 లక్షల పరిహారం నోయిడా: సరిహద్దులో 9 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వహించే రక్షక దళాల సేవలు గుర్తిస్తూ ఇకపై ‘హై ఆల్టిట్యూడ్ మెడల్’ ఇవ్వాలని నిర్ణయించినట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 55వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద దాడి లాంటి సందర్భాల్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచినట్లు హోంమంత్రి పేర్కొన్నారు.