ఆగంతకుడి కాల్పుల్లో జవాన్ దుర్మరణం | Jawan shot dead by unidentified gunmen | Sakshi
Sakshi News home page

ఆగంతకుడి కాల్పుల్లో జవాన్ దుర్మరణం

Published Tue, Aug 4 2015 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

ఆగంతకుడి కాల్పుల్లో జవాన్ దుర్మరణం

ఆగంతకుడి కాల్పుల్లో జవాన్ దుర్మరణం

ఇంఫాల్: దీనానగర్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదుల దాడి ఘటన మరువకముందే మణిపూర్లో గుర్తుతెలియని సాయుధ దుండగు ఓ జవాన్ను కాల్చిచంపాడు. మంగళవారం మద్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఇంఫాల్లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణం వద్ద చోటుచేసుకోవడం గమనార్హం.

మణిపూర్ రైఫిల్స్ ఎనిమిదో బెటాలియన్ కు చెందిన హోప్సన్ మారింగ్ (36) అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుంగ్ థాంగ్ నివాసం వద్ద కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు మద్యాహ్నం గుర్తుతెలియని దుండగుడు తన వెంట తెచ్చుకున్న తుపాకితో హోప్సన్పై కాల్పులు జరిపి పారిపోయాడు. గాయపడ్డ జవానును ఆసుపత్రికి చేర్చేలోగా ప్రాణాలు కోల్పోయాడు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. ఈ దురాగతంపై పోలీసులు పణుకోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement