Unidentified gunmen
-
ఆగంతకుడి కాల్పుల్లో జవాన్ దుర్మరణం
ఇంఫాల్: దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన మరువకముందే మణిపూర్‌లో గుర్తుతెలియని సాయుధ దుండగు ఓ జవాన్‌ను కాల్చిచంపాడు. మంగళవారం మద్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఇంఫాల్‌లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణం వద్ద చోటుచేసుకోవడం గమనార్హం. మణిపూర్ రైఫిల్స్ ఎనిమిదో బెటాలియన్ కు చెందిన హోప్‌సన్ మారింగ్ (36) అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుంగ్ థాంగ్ నివాసం వద్ద కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు మద్యాహ్నం గుర్తుతెలియని దుండగుడు తన వెంట తెచ్చుకున్న తుపాకితో హోప్సన్పై కాల్పులు జరిపి పారిపోయాడు. గాయపడ్డ జవానును ఆసుపత్రికి చేర్చేలోగా ప్రాణాలు కోల్పోయాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ఈ దురాగతంపై పోలీసులు పణుకోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. -
టార్గెట్ ఒకరు...బలైంది మరొకరు
ఢిల్లీ: గుర్గావ్లో జరిగిన గ్యాంగ్‌వార్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ హత్యకేసులో నిందితుడిని హత్యచేసేందుకు పథకం రచించారు కొంతమంది దుండగులు. బుధవారం ఉదయం దేశ రాజధానినగరం నడివీధిలో కాల్పులకు తెగబడ్డారు. అయితే అతను ఈ దాడినుంచి తృటిలో తప్పించుకోగా ఈ ఘటనతో సంబంధంలేని ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బుల్లెట్ దిగడంతో సదరు నిందితుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెడితే హత్యకేసులో నిందితుడుగా ఉన్నవ్యక్తి విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను కాల్పులను తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపుతప్పి, ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు కాల్పులు జరిపిన అయిదుగురు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్ రిజిష్టర్ నెంబరు ఉన్న సాంత్రో కారులో వచ్చినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నారు. -
దుండగుడి కాల్పులు : నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని క్విట్టా నగరంలో గస్తీ తిరుగుతున్న పోలీసు వాహనంపై దుండగుడు శనివారం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు మరణించారు. ఈ మేరకు మీడియా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మరోకరని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని చెప్పారు. -
ఉగ్రవాదులు కాల్పులు:ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
-
ఉగ్రవాదులు కాల్పులు:ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
సైనిక దుస్తులలో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జమ్మూలోని కథువా జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడని పౌరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉగ్రవాదులు అపహరించిన కారులో కథువా జిల్లా దయాళ్ చౌక్ వద్ద ఉన్నపౌరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు చెప్పారు. అనంతరం సైనిక దుస్తులలో ఉన్న ఉగ్రవాదులు అదే జిల్లాలోని జంగ్లాట్ సమీపంలోని ఆర్మీ శిబిరంపై కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైయ్యారు. దీంతో అటు ఉగ్రవాదులకు,సైనికులకు మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి.