ఇస్లామాబాద్: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని క్విట్టా నగరంలో గస్తీ తిరుగుతున్న పోలీసు వాహనంపై దుండగుడు శనివారం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు మరణించారు. ఈ మేరకు మీడియా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మరోకరని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని చెప్పారు.