సైనిక దుస్తులలో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జమ్మూలోని కథువా జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడని పౌరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు.
ఉగ్రవాదులు అపహరించిన కారులో కథువా జిల్లా దయాళ్ చౌక్ వద్ద ఉన్నపౌరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు చెప్పారు. అనంతరం సైనిక దుస్తులలో ఉన్న ఉగ్రవాదులు అదే జిల్లాలోని జంగ్లాట్ సమీపంలోని ఆర్మీ శిబిరంపై కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైయ్యారు. దీంతో అటు ఉగ్రవాదులకు,సైనికులకు మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి.