మెగా వారసుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జవాన్. దర్శకుడిగా మారిన రచయిత బివియస్ రవి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీరప్రేమగాధ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ లుక్ ఎలా ఉండబోతుందన్న హింట్ ఇస్తూ ఓ ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
సినిమాలో హీరో క్యారెక్టర్ లోని డిఫరెంట్ ఎమోషన్స్తో పాటు జవాన్ అనే టైటిల్తో డిజైన్ చేసిన లోగో ఆకట్టుకుంటుంది. ఇంటికొక్కడు అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశారు. దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో, సినిమా రిలీజ్ డేట్లను త్వరలోనే వెల్లడించనున్నారు.