'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత' | Sai Dharam Tej Jawan Teaser | Sakshi
Sakshi News home page

'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత'

Published Tue, Aug 1 2017 10:22 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత'

'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత'

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా  జవాన్. రచయిత బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈసినిమా టీజర్ ను ప్రీల్యూడ్ పేరుతో రిలీజ్ చేశారు. ఇటీవల బాలకృష్ణ, పూరిజగన్నాథ్ ల ఫైసా వసూల్ టీజర్ ను స్టంపర్ పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఫార్ములాను ఫాలో అవుతూ జవాన్ టీజర్ ను ప్రీల్యూడ్ పేరుతో రిలీజ్ చేశారు.

సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పిన దర్శకుడు టీజర్ తో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడు. పూర్తి దేశభక్తి సినిమాగా జవాన్ టీజర్ ను కట్ చేశారు.'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత' అంటూ సాయి చెప్పిన డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లు బబ్లీ హీరోగా కనిపించిన సాయిధరమ్ ఈ సినిమాలో కాస్త హుందాగా కనిపిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement