BVS Ravi
-
‘మార్కెట్ మహాలక్ష్మి’తో పార్వతీశం సక్సెస్ అందుకోవాలి: బీవీఎస్ రవి
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ బీవీఎస్ రవి ఎక్స్(ట్విటర్) ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని 'మార్కెట్ మహాలక్ష్మి' తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో 'బివిఎస్ రవి' గారు ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని బ్లెస్స్ చేసినందుకు చాలా సంతోషం ఉంది’ అని డైరెక్టర్ వియస్ ముఖేష్ అన్నారు. Extremely happy to release the motion poster of MarketMahaLakshmi starring my dear Parvateesam who entertained us before. All the best to the whole team who has good wit and great talent. #MarketMahalakshmi #MM@VSMukkhesh31 @Akhileshkalaru@parvateesam_u #Praneekaanvikaa… pic.twitter.com/mCotatxiKb — BVS Ravi (@BvsRavi) January 31, 2024 -
మీరు ఇడియట్స్.. బేబీ టీమ్‌పై దర్శకుడి ట్వీట్
కొన్ని సినిమాలకు ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్ లేకపోతే ఫలితముండు. అదే కొన్ని చిత్రాలు మాత్రం ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ షోకే జనాలకు కనెక్ట్ అయిపోతుంది. ఈ మధ్య అయితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డీలా పడుతుంటే చిన్న చిత్రాలు మెరుపు విజయాలు అందుకుంటున్నాయి. తాజాగా రిలీజైన బేబీ కూడా ఈ జాబితాలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొంత నెగెటివిటీ కనిపిస్తున్నప్పటికీ బయట మాత్రం పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా బేబీ స్టోరీకి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారట! తాజాగా ఈ సినిమాపై దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు ఇడియట్సా? దురదృష్టవంతులా నాకు అర్థం కావడం లేదు. బేబీని వేసవికాలంలో రిలీజ్ చేయాల్సింది. దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్.. మీరే గనక బేబీని సమ్మర్లో విడుదల చేసుంటేనా ఇండస్ట్రీ హిట్ కొట్టేవాళ్లు' అని ట్వీట్ చేశాడు. మరొక ట్వీట్లో హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్, నటుడు విరాజ్ అశ్విన్ సహా బేబీ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు బీవీఎస్ రవి. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. Congratulations @sairazesh always believed in your writing. Big hugs @SKNonline 🤗 @ananddeverkonda always had the potential and now found #Baby as a platform to perform. @VijaiBulganin hv arrived. Congratulations 💝🤗 @iamvaishnavi04 @viraj_ashwin made the movie COMPLETE… — BVS Ravi (@BvsRavi) July 14, 2023 I don’t know whether you’re idiots or unlucky for not releasing #Baby for this summer. @SKNonline @sairazesh had you done that, it would hv been an industry hit 😀 — BVS Ravi (@BvsRavi) July 14, 2023 చదవండి: బేబీ మూవీ రివ్యూ 4సార్లు జైలుకు.. 400 మందికి నాలుగే బాత్రూమ్స్.. నరకం చూశానన్న విలన్ -
అన్‌స్టాపబుల్: చిరంజీవితో ఎపిసోడ్‌పై షో రైటర్ ఆసక్తికర కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన టాక్‌షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమైన ఈ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిచింది ఈ టాక్ షో. ఇటీవల ముగిసిన ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలరించాడు. అలా ఈ షో సక్సెస్ఫుల్ దూసుకుపోయేలా చేశాడు. దీంతో అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు. ఈ సీజన్‌ను కూడా మరో లెవెల్లోనే చేస్తోందట ఆహా టీం. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ ఇదిలా ఉంటే ఈ టాక్ షోలో బాలయ్యతో కలిసి టాలీవుడ్ స్టార్స్ మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, నాని, రానాలు సందడి చేశారు. టాలీవుడ్ అగ్రహీరోలు వచ్చిన ఈ షోలో మెగా హీరోల సందడి కరువైంది. ఈ క్రమంలో ఈ షోకు రైటర్గాగా వ్యవహరించిన బీవీఎస్ రవి ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజానికి అన్‌స్టాపబుల్ షోకు చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలిపాడు. చదవండి: Meenakshi Chaudhary: ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు నాకేం అభ్యంతరం లేదు కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారని, అటు చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించారని బీవీఎస్ రవి వివరించారు. అందువల్ల చిరంజీవి డేట్లు దొరకడం కష్టమైందని, దాంతో మెగా ఎపిసోడ్ ఆలోచన విరమించుకున్నామని చెప్పారు. కానీ చిరంజీవితో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేసుంటే టాక్ షో మరో లెవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డాడు. రెండో సీజన్లో అయినా చిరంజీవితో ఎపిసోడ్ ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఆయన స్పష్టత లేదన్నాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే.. -
టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..
టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వార్‌కు దిగారు. ఒకరిపై ఒకరూ వరసగా సటైరికల్‌గా పంచ్‌లు వేసుకుంటూ మాటల యుద్దానికి దిగారు. ఇదంతా చూస్తుంటే వారి మధ్య ఎదో కోల్డో వారి జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్, రచయిత బీవీఎస్ రవి. బీవీఎస్ రవి చేసిన ట్వీట్‌కు హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై ఈ గొడవ దారి తీసింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ మొదట బీవీఎస్ రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు దర్శకుడు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్‌ను ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడంతో.. ఇది చూసిన నెటిజన్లు ‘చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏం జరిగింది. ఏదో జరగబోతుందని గట్టిగా కొడుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ — Harish Shankar .S (@harish2you) February 3, 2022 Giving statements on other’s statements at times reverberate as a statement from a critical condition in the struggle to exist. All the best. Continue to sail on social media democracy. https://t.co/6q37rJadCo — BVS Ravi (@BvsRavi) February 4, 2022 అనుభవించడంలో ఒక భాగం పరిపాలన,ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే. ( for those who under read my below tweet. This is said by Chankaya to Chandra gupta in the విశాఖదత్తుడు విరచిత "ముద్రారాక్షసమ్") https://t.co/LKKrnKgePx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C — Harish Shankar .S (@harish2you) February 4, 2022 -
వేడి వేడి జిలేబీలా కొనేస్తారు
‘‘చిన్న సినిమా హిట్ అయిన తర్వాత బావుంది అని అందరూ అంటారు. కానీ దాన్ని షూటింగ్ వరకూ తీసుకురావడం చాలా కష్టం. ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చిందంటే దర్శకుడి శక్తి, నిర్మాతల నమ్మకం కనిపిస్తోంది’’ అన్నారు రచయిత బీవీఎస్ రవి. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ నటించిన చిత్రం ‘రాహు’. ఏవిఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను బీవీఎస్ రవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టీజర్ బావుంది. వేడి వేడి జిలేబీలా ఈ సినిమాను కొనేస్తారని అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘నిర్మాతలు చాలా ఇష్టంతో తీశారు. సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఓ ఫోటో వేయి మాటలు చెబుతుంది అంటారు. మా సినిమా ఏంటో మా టీజర్ మాట్లాడుతుంది. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సుబ్బు వేదుల. ‘‘నా సామర్థ్యాన్ని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక– నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు కృతి. ‘‘మాకు సినిమా గురించి పెద్దగా తెలియదు. సుబ్బు కథ చెప్పారు. మేం సపోర్ట్ చేశాం’’ అన్నారు నిర్మాత స్వామి. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్ : జవాన్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, ప్రసన్న, మెహరీన్, సంగీతం : తమన్ దర్శకత్వం : బీవీయస్ రవి నిర్మాత : కృష్ణ (అరుణాచల్ క్రియేషన్స్) కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. ఈ సమయంలో తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి జవాన్ గా సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధించాడా..? బీవీయస్ రవి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడా..,? కథ : జై (సాయిధరమ్ తేజ్), కేశవ(ప్రసన్న) బాల్య స్నేహితులు. ఇద్దరివి భిన్న మనస్తత్వాలు. ఒక తప్పు చేయటం మూలంగా తనకు మంచి జరుగుతుందని తెలిసినా.. తప్పు చేయననే తత్వం జైది. ఏం చేసైనా హాయిగా, గొప్పగా జీవించాలనుకునే భావన కేశవది. చిన్నతనం నుంచే తప్పుదారిలో పడిన కేశవ కారణంగా వారి కుటుంబం దూరంగా వెళ్లిపోతుంది. దేశానికి సేవచేయాలన్న ఉద్దేశంతో డీఆర్డీఓలో సైంటిస్ట్ గా ఉద్యోగం చేయాలని కలలు కంటుంటాడు జై. (సాక్షి రివ్యూస్) ఎన్నో నేరాలు చేసి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని దేశానికే నష్టం చేయాలనుకుంటాడు కేశవ. భారత సైన్యం కోసం డీఆర్డీఓ తయారు చేసిన ఆక్టోపస్ అనే మిసైల్ లాంచర్ ను శత్రువులకు ఇచ్చేందుకు భారీ డీల్ మాట్లాడుకుంటాడు. ఈ డీల్ జరగకుండా జై ఎలా అడ్డుకున్నాడు..? కేశవ ఆట ఎలా కట్టించాడు..? కేశవ భారీ నుంచి తన కుటుంబాన్ని, ఆక్టోపస్ ని జై ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సాయి ధరమ్ తేజ్ తన గత చిత్రాలతో పోలిస్తే జవాన్ లో కొత్త లుక్ లో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన మార్క్ ఎనర్జీని పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో సినిమా అంతా తన భుజస్కందాల మీదే నడిపించాడు. దేశాన్ని కాపాడాలా..? తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ..? అన్న సంఘర్షణను హావభావాల్లో చాలా బాగా చూపించాడు. విలన్ గా ప్రసన్న సూపర్బ్ అనిపించాడు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహా స్టైలిష్ విలన్ పాత్రలో ప్రసన్న పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత ప్రసన్న తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. హీరో తండ్రి పాత్రలో జయప్రకాష్ మరోసారి తన మార్క్ చూపించారు. సినిమా అంతా హీరో, విలన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ కావటంతో ఇతర పాత్రకు పర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు. విశ్లేషణ : ఇద్దరు భిన్న మనస్తత్వాలున్న స్నేహితుల కథను ఎంచుకున్న దర్శకుడు బీవీయస్ రవి.. ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాను రూపొదించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ ను వేగంగా నడిపించాడు. ముఖ్యంగా హీరో, విలన్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. హీరో, విలన్ల మధ్య జరిగి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ను చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. రచయితగానూ బీవీయస్ రవి సక్సెస్ సాధించాడు. చాలా సందర్భాల్లో డైలాగ్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథకు స్పీడు బ్రేకర్లలా మారాయి. (సాక్షి రివ్యూస్) పాటలు కూడా అదే ఫీల్ కలిగిస్తాయి. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్, ప్రసన్నల నటన కథనం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : పాటలు లవ్ స్టోరి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం
-
'యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం'
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్ దృష్టి లో పెట్టుకొని సినిమాలు చేసిన సాయి.. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేశ ద్రోహిని ఎదుర్కొనేందుకు సిద్ధమయిన యువకుడు తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడితే ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలా రక్షించుకున్నాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నరు. ప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జవాన్ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
జవాన్ మూవీ స్టిల్స్
-
'జవాన్' వచ్చేస్తున్నాడు..!
తిక్క, విన్నర్ సినిమాలు నిరాశపరచటంతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ధరమ్ తేజ్, జవాన్ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు సాయి. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నా.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తాజా ఈ సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 3న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈలోగా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేసి తరువాత కాస్త గ్యాప్ తీసుకొని జవాన్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అదే రోజు ఆది హీరోగా తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. -
'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత'
వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా జవాన్. రచయిత బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈసినిమా టీజర్ ను ప్రీల్యూడ్ పేరుతో రిలీజ్ చేశారు. ఇటీవల బాలకృష్ణ, పూరిజగన్నాథ్ ల ఫైసా వసూల్ టీజర్ ను స్టంపర్ పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఫార్ములాను ఫాలో అవుతూ జవాన్ టీజర్ ను ప్రీల్యూడ్ పేరుతో రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పిన దర్శకుడు టీజర్ తో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడు. పూర్తి దేశభక్తి సినిమాగా జవాన్ టీజర్ ను కట్ చేశారు.'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత' అంటూ సాయి చెప్పిన డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లు బబ్లీ హీరోగా కనిపించిన సాయిధరమ్ ఈ సినిమాలో కాస్త హుందాగా కనిపిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ నిర్మాత. -
'దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత'
-
సెప్టెంబర్ 1న 'జవాన్'
తిక్క, విన్నర్ సినిమాలతో నిరాశపరిచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్. రచయిత, దర్శకుడు బివియస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్‌కు కీలకంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్లో బడా హీరోలు బరిలో దిగుతుండటంతో కాస్త ముందుగానే జవాన్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది జవాన్ యూనిట్. #JawaanonSep1st @IamSaiDharamTej @MusicThaman @Mehreenpirzada @Prasanna_actor pic.twitter.com/i1DTc6SkpB — BVS Ravi (@BvsRavi) 28 June 2017 -
ఇంట్రస్టింగ్ ప్రీ లుక్ : జవాన్
మెగా వారసుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జవాన్. దర్శకుడిగా మారిన రచయిత బివియస్ రవి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీరప్రేమగాధ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ లుక్ ఎలా ఉండబోతుందన్న హింట్ ఇస్తూ ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సినిమాలో హీరో క్యారెక్టర్ లోని డిఫరెంట్ ఎమోషన్స్‌తో పాటు జవాన్ అనే టైటిల్‌తో డిజైన్ చేసిన లోగో ఆకట్టుకుంటుంది. ఇంటికొక్కడు అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశారు. దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో, సినిమా రిలీజ్ డేట్లను త్వరలోనే వెల్లడించనున్నారు. -
పాత బస్తీలో జవాన్
ఎండలు కావివి... మంటలు! ఇంట్లో నుంచి బయట అడుగుపెడితే చాలు... సూరీడు స్ట్రయిట్‌గా మనల్ని ఓ చూపు చూస్తున్నాడు. ఈ మంటల్లో ఓ గంటసేపు గల్లీలో ఓ రౌండ్ వేయాలంటే జనాలు ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. అటువంటిది సాయిధరమ్ తేజ్ (తేజు) మార్నింగ్ టు ఈవెనింగ్ నాన్‌స్టాప్‌గా మండే ఎండల్లో బిజీ బిజీగా షూటింగ్ చేస్తున్నాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తేజు హీరోగా నటిస్తున్న సినిమా ‘జవాన్’. ఆర్మీ జవానులు సరిహద్దులో ఎర్రటి ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మన జవాన్ హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ శనివారం టెంపరేచర్ ఎంతుందో తెలుసా? 42 డిగ్రీలు. పైగా, బిల్డింగ్ పైన సీన్స్... అసలే 42 డిగ్రీస్ టెంపరేచర్... అదీ మిట్ట మధ్యహ్నం... బిల్డింగ్ టెర్రస్ పైన ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ హీట్‌ను లెక్క చేయకుండా తేజూ సీన్స్ కంప్లీట్ చేశారు. సీన్ ఓకే అయిన తర్వాత హీరో కమిట్మెంట్ చూసి దర్శకుడు క్లాప్స్ కొట్టారు. నటుడు కోట శ్రీనివాసరావు, ఇతర నటీనటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. అదీ మేటర్!! -
సినీ రచయిత మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడిన సినీ రచయిత బి.వి.సుబ్రమణ్యం అలియాస్ మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్‌ను 6 నెలలపాటు రద్దుచేశారు. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు ఇలా రెండు సార్లు పట్టుబడిన రితీష్‌సింగ్, మరో వ్యాపారి డ్రైవింగ్‌లెసైన్స్ రద్దైనట్లు పేర్కొన్నారు. డ్రంకన్‌డ్రైవ్ లో మళ్లీ పట్టుబడ్డ సినీ రచయిత -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మళ్లీ పట్టుబడిన సినీ రచయిత
సినిమా రచయిత బీవీఎస్ రవి మరోసారి మద్యం తాగుతూ వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కోసం తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్లతో అటు నుంచి వెళ్లే వాహన చోదకులు అందరినీ తనిఖీ చేస్తుండగా, రచయిత బీవీఎస్ రవి కూడా అటుగా వెళ్తున్నారు. ఆయన పక్కనే ఆ సమయంలో వాహనంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. వాహనం నడుపుతున్న బీవీఎస్ రవిని పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా, మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంతకుముందు కూడా ఒకసారి ఈయన మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో ఇది రెండోసారి అయ్యింది. గతంలో ఆయన పట్టుబడినప్పుడు అదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది. అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన సినీ రచయిత
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ రచయిత బివిఎస్ రవి దొరికిపోయారు. ఆయన మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తూ వస్తుండగా అర్థరాత్రి పోలీసులు ఆపి సోదాలు చేశారు. దాంతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది.అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా వాహదారులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చెక్ చేస్తున్న పోలీసులు పలుకుబడి ఉన్నవారిని, ప్రజాప్రతినిధులను మాత్రం వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.