పాత బస్తీలో జవాన్
ఎండలు కావివి... మంటలు! ఇంట్లో నుంచి బయట అడుగుపెడితే చాలు... సూరీడు స్ట్రయిట్‌గా మనల్ని ఓ చూపు చూస్తున్నాడు. ఈ మంటల్లో ఓ గంటసేపు గల్లీలో ఓ రౌండ్ వేయాలంటే జనాలు ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. అటువంటిది సాయిధరమ్ తేజ్ (తేజు) మార్నింగ్ టు ఈవెనింగ్ నాన్‌స్టాప్‌గా మండే ఎండల్లో బిజీ బిజీగా షూటింగ్ చేస్తున్నాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తేజు హీరోగా నటిస్తున్న సినిమా ‘జవాన్’. ఆర్మీ జవానులు సరిహద్దులో ఎర్రటి ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం మన జవాన్ హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ శనివారం టెంపరేచర్ ఎంతుందో తెలుసా? 42 డిగ్రీలు. పైగా, బిల్డింగ్ పైన సీన్స్... అసలే 42 డిగ్రీస్ టెంపరేచర్... అదీ మిట్ట మధ్యహ్నం... బిల్డింగ్ టెర్రస్ పైన ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ హీట్‌ను లెక్క చేయకుండా తేజూ సీన్స్ కంప్లీట్ చేశారు. సీన్ ఓకే అయిన తర్వాత హీరో కమిట్‌మెంట్ చూసి దర్శకుడు క్లాప్స్ కొట్టారు. నటుడు కోట శ్రీనివాసరావు, ఇతర నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అదీ మేటర్!!