Unstoppable With NBK: BVS Ravi Interesting Comments on Chiranjeevi Episode With Nandamuri Balakrishna - Sakshi
Sakshi News home page

Unstoppable With NBK: చిరంజీవితో ఎపిసోడ్‌పై షో రైటర్‌ ఆసక్తికర కామెంట్స్‌

Published Wed, Feb 9 2022 6:01 PM | Last Updated on Wed, Feb 9 2022 6:58 PM

Unstoppable: BVS Ravi Interesting Comments On Proposal Of Balakrishna, Chiranjeevi Episode - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన టాక్‌షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమైన ఈ షో ఎంతగా పాపులర్‌ అయ్యిందో​ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిచింది ఈ టాక్‌ షో. ఇటీవల ముగిసిన ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్‌, లుక్స్‌, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ అలరించాడు. అలా ఈ షో సక్సెస్‌ఫుల్‌ దూసుకుపోయేలా చేశాడు. దీంతో అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు.  ఈ సీజన్‌ను కూడా మరో లెవెల్లోనే చేస్తోందట ఆహా టీం.

చదవండి: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ కామెంట్స్‌ వైరల్‌

ఇదిలా ఉంటే ఈ టాక్‌ షోలో బాలయ్యతో కలిసి టాలీవుడ్‌ స్టార్స్‌ మోహన్‌ బాబు, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, నాని, రానాలు సందడి చేశారు. టాలీవుడ్‌ అగ్రహీరోలు వచ్చిన ఈ షోలో మెగా హీరోల సందడి కరువైంది.  ఈ క్రమంలో ఈ షోకు రైటర్‌గాగా వ్యవహరించిన బీవీఎస్‌ రవి ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజానికి అన్‌స్టాపబుల్‌ షోకు చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలిపాడు.

చదవండి: Meenakshi Chaudhary: ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు నాకేం అభ్యంతరం లేదు

కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారని, అటు చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించారని బీవీఎస్ రవి వివరించారు. అందువల్ల చిరంజీవి డేట్లు దొరకడం కష్టమైందని, దాంతో మెగా ఎపిసోడ్ ఆలోచన విరమించుకున్నామని చెప్పారు. కానీ చిరంజీవితో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేసుంటే టాక్ షో మరో లెవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డాడు. రెండో సీజన్‌లో అయినా చిరంజీవితో ఎపిసోడ్ ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఆయన స్పష్టత లేదన్నాడు.

చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement