
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్, కామెడీతో బాలయ్యా ఈ షోను శాంతం ఆసక్తిగా మలిచాడు. అంతేకాదు గెస్ట్‌గా వచ్చిన స్టార్స్ నుంచి తనదైన స్టైల్లో ఆసక్తికర విషయాలను రాబడుతూ ఆశ్చర్యపరిచాడు బాలయ్య.
చదవండి: ఈ యూట్యూబర్‌కు డైరెక్టర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారుగా!
తొలిసారి ఓటీటీ వేదికగా వచ్చిన ఈ టాక్ షో టీఆర్‌పీ రేటింగ్‌లో ముందంజలో దూసుకుపోతూ రికార్ట్ క్రియేట్ చేసింది. అలా హిట్ టాక్‌తో అన్‌స్టాపబుల్ షో తొలి సీజన్ విజయవంతంగా ముగిసింది. ఇక త్వరలోనే రెండో సీజన్‌తో మరోసారి పలకరించబోతున్నాడు బాలయ్య. దీంతో ఈ సీజన్ కోసం ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్రమంలో వారికి మరింత ఆనందాన్ని ఇచ్చే ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ షో తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
చదవండి: ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని
ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో సెకండ్ సీజన్ తొలి ఎపీసోడ్‌కు చిరంజీవి వస్తే ఈ షోకు మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ అగష్టులో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం షోకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారట నిర్వహకులు.
Comments
Please login to add a commentAdd a comment