నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేకు ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం విశేష స్పందన వస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా టీం. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మొత్తం ప్రభాస్ వీడియోలతో నిండిపోయాయి. ప్రభాస్ దెబ్బకు ఏకంగా ఈ యాప్ క్రాష్ అయ్యింది.
చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు
క్షణాలకే ఈ ఎపిసోడ్ లక్షల వ్యూయర్ షిప్‌తో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించిన ఆహా టీం.. తాజాగా ఓ ఆసక్తిర వీడియోను షేర్ చేసి ‘డార్లింగ్’ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. స్టేజ్‌పై బాలయ్యతో ప్రభాస్ చేసిన సందడిని చూపించిన ఆహా.. తాజాగా స్క్రీన్ వెనక చేసిన ఈ ‘బాహుబలి’ అల్లరిని చూపించింది. బిహైండ్ ది సీన్ పేరుతో తాజాగా ఆహా ఓ కొత్త వీడియో విడుదల చేసింది.
చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న విజయ్ కుమారుడు!
సెట్‌లో బాలకృష్ణ, ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ‘మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘అయ్యో నాకు తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకి ఇంకో కుటుంబం అంటూ ప్రభాస్‌కి చెప్పుకొచ్చాడు బాలయ్య. ఇలా షో షూటింగ్‌లో ఫ్యాన్స్‌తో ప్రభాస్ ముచ్చటించిన సీన్స్, బాలయ్య, ఆహా టీంతో చేసిన అల్లరి వంటి పలు ఆసక్తర సన్నివేశాలతో ఈ వీడియోను మలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment