బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో తొలి రెండు సీజన్లు మంచి విజయం సాధించాయి. లిమిటెడ్‌గా వచ్చిన మూడో సీజన్ అంతగా విజయం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాలుగో సీజన్‌ని మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు మేకర్స్. త్వరలోనే అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త సీజన్‌లో కొత్త కొత్త సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారట మేకర్స్.
ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలంతా ఈ షోలో సందడి చేశారు. ఇక నాలుగో సీజన్‌కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ షో ప్రారంభం నుంచి అభిమానులంతా చిరంజీవి గెస్ట్‌గా రావాలని కోరుకుంటున్నారు. మూడో సీజన్‌లోనే చిరంజీవి వస్తారని పుకార్లు వచ్చాయి. కారణం ఏంటో తెలియదు కానీ చిరు మాత్రం రాలేకపోయాడు.
అయితే ఈ సారి షో ప్రారంభమే చిరంజీవితో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి బర్త్‌డే (ఆగస్ట్ 22)సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్‌లో చిరుతో పాటు నాగార్జున కూడా సందడి చేయబోతున్నారట. అలాగే మరో సీనియర్ హీరో వెంకటేశ్‌తో కూడా టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ఒకవేళ వెంకీమామ కూడా ఓకే అంటే.. టాలీవుడ్ దిగ్గజ హీరోలంతా ఈ కొత్త సీజన్‌లో సందడి చేసినట్లే అవుతుంది. కొత్త సీజన్ ప్రారంభం ఎప్పుడు? గెస్ట్‌లు ఎవరనేది తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment