War Between Director Harish Shankar and Writer BVS Ravi on Twitter - Sakshi
Sakshi News home page

Harish Shankar Vs BVS Ravi: టాలీవుడ్‌ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్‌, ట్వీటర్‌ వేదిక ఒకరిపై ఒకరు కౌంటర్‌..

Published Fri, Feb 4 2022 4:57 PM | Last Updated on Fri, Feb 4 2022 6:02 PM

Battle Between Director Harish Shankar And Writer BVS Ravi On Twitter - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖులు ఇద్దరు సోషల్‌ మీడియా వేదికగా వార్‌కు దిగారు. ఒకరిపై ఒకరూ వరసగా సటైరికల్‌గా పంచ్‌లు వేసుకుంటూ మాటల యుద్దానికి దిగారు. ఇదంతా చూస్తుంటే వారి మధ్య ఎదో కోల్డో వారి జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌, రచయిత బీవీఎస్‌ రవి. బీవీఎస్‌ రవి చేసిన ట్వీట్‌కు హరీశ్‌ శంకర్‌ ఇచ్చిన రిప్లై ఈ గొడవ దారి తీసింది.

చదవండి: హీరోయిన్‌ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్‌ వైరల్‌

మొదట బీవీఎస్‌ రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్‌ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్‌ను ఎంజాయ్‌ చేయండి. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడంతో.. ఇది చూసిన నెటిజన్లు ‘చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏం జరిగింది. ఏదో జరగబోతుందని గట్టిగా కొడుతోంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement